ఐఫోన్‌12‌పై నిషేధం..?

పారిస్‌,‌సెప్టెంబర్‌ 13 :  ‌యాపిల్‌ ‌సంస్థకు చెందిన ఐఫోన్‌ 12‌పై ఫ్రాన్స్‌లో బ్యాన్‌ ‌విధించారు. ఆ ఫోన్‌ ‌నుంచి అధిక స్థాయిలో రేడియేషన్‌ ‌వస్తున్నట్లు నేషనల్‌ ‌ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ పేర్కొన్నది. యురోపియన్‌ ‌యూనియన్‌ ‌విధించిన ఆంక్షల కన్నా ఎక్కువ స్థాయిలో ఐఫోన్‌ 12 ‌స్మార్ట్‌ఫోన్‌ ‌నుంచి ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ ‌తరంగాలు రిలీజ్‌ అవుతున్నట్లు ఫ్రాన్స్ ఆరోపించింది. మార్కెట్లో ఉన్న అన్ని ఐఫోన్‌ 12 ‌ప్రో ఫోన్లను తక్షణమే అమ్మడం ఆపివేయాలని ఆ దేశం పేర్కొన్నది.

ఈయూ ప్రకారం ఆ ఫోన్‌ ‌సిగ్నల్స్‌లో స్పెసిఫిక్‌ అబ్జార్పషన్‌ ‌రేట్‌ అధికంగా ఉన్నట్లు తేల్చారు. ఐఫోన్‌ 12 ‌చేతుల్లో ఉన్నా.. జేబులో ఉన్నా.. దాని నుంచి నాలుగు వాట్స్(‌వాట్స్-‌కేజీ) శక్తి రిలీజ్‌ అవుతోంది. అయితే ఆ ఫోన్‌ ‌బ్యాగులో ఉన్నప్పుడు దాని నుంచి కేవలం రెండు వాట్స్ ‌శక్తి వస్తోందని రిపోర్టు ద్వారా తెలిసింది.ఐఫోన్‌ 12‌ను అక్టోబర్‌ 2020‌లో ప్రవేశపెట్టారు. ఇరత మాడల్స్‌తో పోలిస్తే, ఆ ఫోన్‌ ‌ధర చాలా తక్కువ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *