సిద్ధిపేట ప్రజలు ఆత్మసాక్షిగా నాకు మార్కులు వేయాలి
పక్క రాష్ట్రం వారికి వోట్లు అడిగే హక్కు లేదు
సెన్సేషన్ అవడం కోసం కేసీఆర్‌పై నోరు జారుతున్నారు..
సిద్ధిపేటలో నామినేషన్ వేసిన మంత్రి హరీష్ రావు
గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సిఎం కేసీఆర్
అంబులెన్స్‌లో వొచ్చి నామినేషన్ వేసిన దుబ్బాక అభ్యర్థి కేపీఆర్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 9 : ‘సిద్ధిపేట ప్రజలు నా కుటుంబ సభ్యులు. భగవంతుడు ఇచ్చిన శక్తినంతటిని కూడా సిద్ధిపేట ప్రజల కొరకే వినియోగించా. మీ కోసం ప్రతి రోజూ 18 గంటలు కష్టపడ్డా…6 సార్లు అద్భుత విజయం అందించి సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఐదేళ్లు కష్టపడి పని చేశా..పరీక్ష రాశా, ప్రజలు తమ ఆత్మ సాక్షిగా నాకు మార్కులు వేయాలి’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తన్నీరు హరీష్‌రావు ప్రజలను కోరారు. గురువారం మంత్రి హరీష్ రావు సర్వమత ప్రార్థనలు(వేంకటేశ్వరస్వామి ఆలయం, మసీద్‌లోని ఈద్గా, సిఎస్‌ఐ చర్చిలో)నిర్వహించిన అనంతరం స్థానిక ఆర్టీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…సిద్ధిపేట ప్రజలు తన కుటుంబ సభ్యులు, ప్రచారకులని…ప్రజల ఆలోచనలు.. ప్రజల మనసులో కోరుకునే అభివృద్ధి వారి కళ్లముందు ఉంచాని, వారు ఆశీర్వదించాలని అన్నాన్నారు. సిద్ధిపేట ప్రజల ఆలోచన, అభివృద్ధిపై పరీక్ష వ్రాసానని, ఎన్ని మార్కులు వేస్తారో వారిదే నిర్ణయమని అన్నారు. ఎన్నికలప్పుడు వొచ్చేది ఎవరు…. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేది ఎవరని సిద్ధిపేట ప్రజలు ఆలోచించాన్నారు. సిద్ధిపేట పేరుప్రతిష్టలను, గౌరవాన్ని పెంచుకున్నామని, మరింత నిలబెట్టుకోవడానికి ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఇప్పటి వరకు 6 సార్లు అద్భుత విజయం అందించినందుకు సేవ చేసి ఏడోసారి బిఆర్‌ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా నామినేసన్ దాఖలు చేశాననీ, ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలన్నారు. సిద్ధిపేట ప్రజలు కోరుకున్న పనులే కాకుండా కోరని ఎన్నో పనులు చేశాననీ, ఆనాడు తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవనీ, నేడు స్వరాష్ట్రంలో సిఎం కేసీఆర్ పాలనలో అలాంటి పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ నేడు రాష్ట్రాన్ని రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఐటిలో 6 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో లక్షా 80 వేల ఉద్యోగాలు కల్పించామనీ, కొంత మంది ప్రక్క రాష్ట్రం నాయకులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారనీ, వారు ఇక్కడ ఏం చెప్పదలచుకున్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం వారికి ఇక్కడ వోటు అడిగే నైతికత లేదన్నారు. దేశానికి దిక్సూచిగా తెలంగాణను సిఎం కేసీఆర్ తీర్చిదిద్దారనీ, అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటదో కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం కూడా అంతే క్షేమంగా ఉంటుందన్నారు. నమ్మిన నాయకుడు కేసీఆర్‌ని కాదని ఇతర పార్టీలకు వోట్లు వేయొద్దనీ, బిజెపి, కాంగ్రెస్ వాళ్లకు వోటు వేస్తే రాష్ట్రం 10 ఏళ్లు తిరిగి వెనుకకు పోతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, బిజెపి వాళ్లు అభివృద్ధి చేయలేదనీ, సిద్ధిపేట ప్రజలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. సెన్సేషన్ అవడం కోసం కొందరు సిఎం కేసీఆర్‌పై నోరు జారుతున్నారనీ పరోక్షంగా రేఖానాయక్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు కౌం•ర్ ఇచ్చారు. తండ్రి వయస్సు ఉన్న కేసీఆర్‌ను నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఈ రాష్ట్రానికి కావల్సింది బూతు నాయకులు కాదనీ, భవిష్యత్‌ను అందించే నాయకులు కావాలనీ, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ అవసరమన్నారు. పక్క రాష్ట్రంకు చెందిన నేతల మా•లను పట్టించుకోవద్దన్నారు. ఈ రాష్ట్రం మీద కేసీఆర్‌కు ఉన్న అవగాహన మరే పార్టీ నాయకుడికి లేదన్నారు. ఇతర రాజకీయ పార్టీలను నమ్మి రిస్కు తీసుకోవడం ఎందుకన్నారు. ఒక గుంట కూడా ఎండకుండా పంటలు పండుతున్నాయనీ, పక్క రాష్ట్రంలో, దేశంలో ఏమవుతుందో చూస్తున్నామనీ, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయన్నారు. నమ్మిన నాయకుడు •కేసీఆర్‌ని కాదని ఇతర పార్టీలకు వోట్లు వేయొద్దనీ మంత్రి హరీష్‌రావు పదేపదే కోరారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బాలకిషన్‌రావు, రాజనర్సు, దువ్వల మల్లయ్య, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, మోహన్‌లాల్, కాముని శ్రీనివాస్, పాల సాయిరాం తదితరులు ఉన్నారు.
సర్వమత ప్రార్థనలు చేసి…రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేసి…

మంత్రి హరీష్‌రావు గురువారం సిద్ధిపేటలో ముందుగా సర్వమత ప్రార్థనలు చేసి అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అంతకు ముందు సిద్దిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం పట్టణంలో ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆర్వో కార్యాలయంలో నామినేషన్స్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే, మంత్రి హరీష్‌రావు 2004 నుంచి సిద్ధిపేటకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో 24,827 మెజార్టీతో విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో 58,935 మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో తన మెజారిటీని పెంచుకుంటూ వెళ్తున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64,014వోట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసిన ఆయన.. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఆధిక్యంతో విజయం సాధించారు. ఇత తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో 93,328 వోట్ల మెజారిటీ, 2018 ఎన్నికల్లో 1,18,699 మెజార్టీతో విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలకు కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా చేశారు.
గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన సిఎం కేసీఆర్..

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను గజ్వేల్‌లోని ఆర్వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎర్రవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్‌కు వొచ్చిన కేసీఆర్… నామినేషన్ దాఖలు అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డికి బయలుదేరి వెళ్లారు.
అంబులెన్స్‌లో వొచ్చి నామినేషన్ వేసిన దుబ్బాక అభ్యర్థి కేపీఆర్…

దుబ్బాక బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి(కేపీఆర్)అంబు




