తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించిన విషయం విధితమే. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు.విదేశాల నుంచి తిరిగి వచ్చిన కేటీఆర్ ను మహేందర్ రెడ్డి ఆయన స్వగృహంలో కలిశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కష్టానికి ప్రతిఫలంగా మహేందర్ రెడ్డికి మంచి రోజులు వచ్చాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంత్రి మహేందర్ రెడ్డితో ఉన్న తాండూర్ సీనియర్ నాయకుడు కర్ణం పురుషోత్తం రావుకు కేటీఆర్ మీకు మంచి రోజు వస్తాయని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయని కేటీఆర్ అన్నారు.



