ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జూలై 27 : ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను అరెస్ట్ చేయ్యాలి లేకుంటే మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తామని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు త్యాలపల్లి కృష్ణ ఘాటుగా పేర్కొన్నారు.కేటిఆర్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులతో హ్యాపీ బర్త్డే అని విద్యార్థులను వంగబెట్టి హ్యాపీ బర్త్డేఅనేగా చిత్రించుకుని చెప్పుకోవడం నీచమైన పని అని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు త్యాళ్లపల్లి ఏద్దేవ చేశారు.గురువారం ఆయన ”ప్రజాతంత్ర”తో మాట్లాడుతూ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమారుడైన తారక రామారావు తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకునే విధంగా పాఠశాల విద్యార్థులతో హ్యాపీ బర్త్డే అనే విధంగా విద్యార్థులను వంగబెట్టి చిత్రించుకోవడం హేయమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణ ఐటి మంత్రిగా ఉంటూ పసి పిల్లలచే ఈ విధంగా చేయించడం నైజాం ప్రభుత్వానికి దీటుగా కనిపిస్తుందని ఆయన ఆరోపించారు.ఇది రాచరిక పాలనా?ప్రజా పరిపాలన అని ఆయన మండిపడ్డారు.ఈ విషయమై ఐటి మంత్రి కేటిఆర్ వెంటనే క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి కెసిఆర్ ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేకుంటే జాతీయ,రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన ఘాటుగా హెచ్చరించారు.తెలంగాణ ఏర్పాటు అయ్యాక పూర్తిగా ఆరాచక పరిపాలన నడుస్తుందని ఆయన ధ్వజమెత్తారు.మీ పుట్టినరోజులు మీ ఇండ్లలో జరుపుకోవాలని ఇలా విద్యార్థులు చేత వంగబెట్టి ఇలాంటి ఘాతకాలకు పాల్పడవద్దని మంత్రికి ఆయన హితవు పలికారు.మనము సమ సమాజంలో ఉన్నామా లేక రజాకారుల పాలనలో ఉన్నామా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. విద్యార్థులు అంటే మీకు ఎందుకు అంత చులకన అని ఆయన కేటీఆర్ ను ఆయన ప్రశ్నించారు.ఏదో తెలంగాణ వస్తే మరేదో జరుగుతుందని తెలంగాణ ప్రజలు భావించారు తప్ప ఇలాంటి రాచరిక పరిపాలన కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.




