ఐటిఐల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ఈ విద్యా సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. ఇంజినీరింగ్‌, ‌నాన్‌ ఇం‌జినీరింగ్‌ ‌కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పదో తరగతి పాస్‌/‌ఫెయిల్‌ ‌లేదా 8వ తరగతి పాస్‌ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జులై 31వ తేదీ లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్హత, కులం, స్టడీ, లోకల్‌ ‌సర్టిఫికేట్లతో పాటు తాజా పాస్‌పోర్ట్ ‌సైజ్‌ ‌ఫోటోను స్కాన్‌ ‌చేసి అప్‌లోడ్‌ ‌చేయాలన్నారు. ఇతర పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ ‌ద్వారా పొందవచ్చని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *