బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ గాలి వినోద్ కుమార్
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించాలనీ బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ గాలి వినోద్ కుమార్, అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓం ప్రకాష్ యాదవ్, లాయర్స్ పోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ యాదవ్ లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో 2024లో జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీనీ భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బిసి సీఎంను ప్రకటించిన బిజెపి పార్టీ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. మూడు సంవత్సరాలుగా తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో అధ్యయనం చేశామని, తెలంగాణలో ఉన్న 52 శాతం బీసీలు ఉన్నారనీ ఇప్పటివరకు బీసీలను సీఎం కానివ్వడం లేదన్నారు. బీసీలు వారి ఓట్లు బీసీ అభ్యర్థులకు వేయడం లేదనీ అందువల్లే బీసీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో అఖిలభారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రవి, కార్యదర్శి సుదర్శన్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది సురేందర్, న్యాయవాదులు వినోద్ కుమార్, హనుమంతరావు పాల్గొన్నారు.



