ఏమో మరి…

కాశం నెర్రెలు బారి
నీటి చుక్కల
కన్నీటి జాడలో ఇంకిన నిజంతో

పాయలుగా చీలి కల
గాయపడ్డ రాత్రుల్లో
కలవరింత గోతుల్లో

ఎర్రపడ్డ ఊహలని
తవ్వుకున్నప్పుడు
తలిగిన జ్ఞాపకాల వెలుగుతో

దేహాపు చీకటిలో
పారె  ఇష్టం పొర్లి
తేలిన అనుభవాల ఆసరాతో

కలే చమురుగా  కదిలే  బతుకు
ఏ తీపి తీరం చేరునో!
ఏ చేదు విధిగా మారునో!
-చందలూరి నారాయణరావు
              9704437247

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *