హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 27 : విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని రోటరీ క్లబ్ కోకాపేట అధ్యక్షురాలు డా.ప్రణీత వల్లాల పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ కోకాపేట్ ఏకం మాదాపూర్‌లోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఇంటరాక్ట్ ఇన్‌స్టాలేషన్ వేడుకను నిర్వహించింది. ఇంటరాక్ట్ క్లబ్‌లో 7, 8, 9వ తరగతి విద్యార్థుల నుండి 30 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ వేడుకల్లో విద్యార్థులు విద్యలో తమ వంతు కృషి చేయాలని, దయతో ప్రజలకు సేవ చేయాలని ప్రోత్సహించారు. అతిథి ఆర్.టీ.ఎన్ రాంప్రసాద్ ఐదుగురు 10వ తరగతి ఉత్తమ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను అందజేశారు. ఓరియెంటెడ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ యాక్టివిటీస్ అన్నీ ‘ఇష్టంతో చదువు’ అనే కార్యక్రమం ఆర్.టీ.ఎన్ మూర్తిచే ప్రారంభించబడింది. ఇక్కడ విద్యార్థులు కంప్యూటర్లు, కళలు, నృత్యం, నటనను నేర్చుకోవాలనే ఆసక్తిని వ్యక్తం చేయగా వీటిని రోటేరియన్లు పాఠశాల కోసం కోరికల జాబితాలోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్టిఎన్ శ్రీలత మంద, సభ్యులు ఆర్టిఎన్.రాజశేఖర్, డా.లలిత, రవి ముత్తినేని పాల్గొన్నారు.
ఏపీ మోడల్ స్కూల్‌లో ‘ఇంటరాక్ట్ ఇన్‌స్టాలేషన్’ వేడుకలు




