ఏపి ఒంటిమిట్టలో వైభవంగా చక్రస్నానం

ముగిసిన శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, ఏప్రిల్‌ 8 : ‌టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు శనివారం ఆలయ సపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గని పుణ్యస్నానాలు చేశారు. ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు.అనంతరం శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవమూర్తులకు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్‌ ‌పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకాలు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్తోక్త్రగా చక్రస్నానం నిర్వహించారు.రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మౌత్సవాలు ముగియనున్నాయని డిప్యూటీ ఈవో నటేశ్‌బాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *