హైదరాబాద్, డిసెంబర్ 24 : ప్రపంచ దేశాలపై కరోనా విజృంభిస్తోన్న వేళ ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వ్యాక్సిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బూస్టర్ డోస్‌గా కార్బోవ్యాక్స్ టీకాను తీసుకోవడం ఉత్తమమని, దీని వల్ల ఐజీజీ యాంటిబాడీస్ స్థాయిలు అత్యధికంగా పెరగడమే కాకుండా మెమరీ సెల్స్ సైతం ఎక్కువ కాలం పాటు ఉంటున్నాయని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.
కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావల్సిన పనిలేదని, బీఎఫ్-7 సబ్‌వేరియంట్ డెల్టా వేరియంట్ అంత ప్రమాదకారి కాదని స్పష్టం చేశారు. అయితే, కరోనా పూర్తిగా తగ్గనందున ఏటా ఒకసారి బూస్టర్ డోస్ తీసుకోవటం మంచిదని ఆయన తెలిపారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు




