ఏక్ బార్, ధోబార్, తీన్ బార్ కెసిఆర్ ఏ ముఖ్యమంత్రి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు నాంది పలుకుతాయని ఏక్ బార్, దోబార్, తీన్ బార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ సీఎం అవుతారని ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లపురం శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి లు అన్నారు. గురువారం ఆమనగల్లు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ తన ప్రభంజనాన్ని సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి కైవసం చేసుకుంటుందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేద ప్రజలే ద్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో  ఈసారి ప్రజలంతా కలిసి అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తపరిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్టాల ప్రజలు కూడా మా రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత సేవ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీని కార్యకర్తలు, నాయకులు, అందరూ సమన్వయంతో పనిచేసి గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు. రైతులకు రుణమాఫీ, దివ్యాంగులకు పెన్షన్  పెంచిన విషయాన్ని  ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, వడ్డెమోని శివకుమార్, జంతుక కిరణ్, సుమన్ నాయక్, బన్నే శేఖర్, రైసల్ నాయక్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *