పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:బీసీ నేత, రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా సబండ వర్గాలు ఏకమవుతున్నాయి.
పటాన్ చెరు నియోజకవర్గంలో నీలం మదుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ వివిధ కుల సంఘాలు, యువత గొంతేత్తుతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నీలం మదుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన బహుజన నాయకుడు నీలం మధుకు కేసీఆర్ టికెట్ కేటాయించాలనే డిమాండ్లు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 65 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కేసీఆర్ విస్మరించడం పట్ల ఆ వర్గం ప్రజలతో పాటు మిగిలిన బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 65 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రకారం టికెట్లు కేటాయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్ చెరు టికెట్ పై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని ముక్త కంఠంతో సబ్బండ వర్గాల ప్రజలు కోరుతున్నారు. రక్షాబంధన్ పండుగ నాడు సైతం నీలం మధు మద్దతుదారులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తన అభిమాన నేతకు టికెట్ వచ్చినరోజే తమకు పండుగ వాతావరణమని తేల్చి చెప్తున్నారు.నీలం మధు కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ
కిష్టారెడ్డి పేటలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనుక్షణం ప్రజలతో మమేకమై ఉంటున్న నీలం మధు ముదిరాజ్ కి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా అనునిత్యం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి అవిశ్రాంతంగా కృషిచేసిన నీలం మధు కు ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ నిరాకరించడం సరికాదన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ టికెట్ పై ఇకనైనా కేసీఆర్ పునరలోచించుకుని, సబ్బండ వర్గాలందరికి ఆమోదయోగ్యుడైన నీలం మధు ముదిరాజ్ కి కేటాయించాలని కోరారు. 65 లక్షల జనాభా గలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం కల్పించడం ద్వారానే సరైన ప్రాతినిధ్యం దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నీలం మధుకు టికెట్ కేటాయిస్తే ఇంటికొకరం ఇన్చార్జిగా పనిచేసే గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా మచ్చ మత్సశాఖ డైరెక్టర్ మహేష్, బొమ్మను కుంట వార్డు సభ్యులు రాజు, మన్నే రాములు,ప్రభాకర్,మహేష్,యాదగిరి, బాల్ రాజ్,బిక్షపతి,కుమార్,శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.



