ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల పై అకారణంగా చేయి చేసుకున్న డీసీపీ వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలి

షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్ 10: ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని.  ఇటీవల కాలంలో విద్యార్థి సంఘాలు మీడియా విద్యాలయాల్లోకి రావద్దంటూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరియు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ సెక్రటేరియట్ ముట్టడి తలపెట్టి… ముందుకు సాగుతున్న సందర్భంలో విద్యార్థి నాయకులు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులపై బూతు మాటలతో ,పిడుగుద్దలతో గుద్దుతూ సెక్రటేరియట్ వద్దకు మీరు రావద్దు అంటూ   _మీడియా ఉందన్న విచక్షణ కూడా లేకుండా ఆగ్రహంతో ఊగిపోతూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని, మానవ హక్కులను తుంగలో తొక్కి, ఫ్రెండ్లీ పోలీసులను గాలికి వదిలేసి అకారణంగా అన్యాయంగా విద్యార్థి నాయకులను పై దాడి చేయడం సిగ్గుచేటని ఈ దాడికి పాల్పడిన డీసీపీ వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలని, షాద్నగర్ దేవి గ్రాండ్ హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పవన్ చౌహన్  షాద్నగర్ డివిజన్ కార్యదర్శి ఆకాష్ నాయక్ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శివ యాదగిరి అంబేద్కర్ సంఘం నాయకులు జగన్ మహేష్, సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు లేకుంటే హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ ని సంప్రదిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *