ఎస్.ఎన్.డి.పి పనులను పర్యవేక్షించిన సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర జూలై 18 : ఎస్.ఎన్.డి.పీ. పనుల్లో భాగంగా ఈ రోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి లింగోజిగూడా డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం ఎస్.ఎన్.డి.పీ.అధికారులచే సమావేశం ఏర్పాటు చేసి పనుల్లో వేగం పెంచాలని వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.దానిలో భాగంగా ఈ రోజు అట్టి పనుల నేపథ్యంలో సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని ఆకస్మికంగా పర్యటించారు.చంద్ర గార్డెన్స్ నుంచి ఉదయ్ నగర్ కాలనీ మీదుగా ఒక ప్యాకేజీ,వంగ శంకరమ్మ నుంచి పద్మ నగర్ కాలనీ మీదుగా ఒక ప్యాకేజీ పనులు చేయడం జరుగుతుందని అన్నారు.ఇట్టి పనులు తుది దశకు చేరుకోవడం జరిగింది అని తెలిపారు.ఇట్టి పనులు పూర్తి అయితే ఎంత పెద్ద వర్షం వచ్చిన వరదనీటి సమస్యల నుంచి పూర్తి స్థాయిలో విముక్తి లభిస్తుంది అని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు.అలాగే పనుల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు పాటిస్తూ పనులు చేయాలని సూచించారు.ఇట్టి కార్యక్రమంలో ఎల్.బి.నగర్ నియోజకవర్గ బారాస పార్టీ యువజన అధ్యక్షులు ముద్ద కళ్యాణ్,చీర తిరుమలేష్,చంద్రశేఖర్ రెడ్డి,సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *