ఎస్సి, ఎస్టీ, బీసీలను దగా చేస్తున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06 : అగ్ర వర్ణ రాజకీయ పార్టీలు స్వాతంత్ర అనంతరం నుంచి నేటి వరకు ఎస్సి, ఎస్టీ, బిసిలను దగా చేస్తూనే ఉన్నాయని ప్రజా సైన్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి లకు జనాభా దమాషా ప్రకారం చట్ట సభల్లో అన్ని రాజకీయ పార్టీలు రిజర్వ్ స్థానాలతో పాటు అదనంగా ఆయా వర్గాలకు జనరల్ స్థానాల్లో సముచిత స్థానం కల్పించాలని అన్నారు. కేవలం ఆరు శాతం ఉన్న అగ్ర వర్ణాలను చట్ట సభల్లోకి పంపితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ ఎన్నికల్లో ఐనా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరిస్తున్న సిఎం కెసిఆర్ ఈ విషయంలో చొరవ చూపాలని అన్నారు. మతతత్వ ఆలోచన ధోరణితో ముందుకు సాగుతున్న పార్టీలను ప్రజలు దరిదాపుల్లోకి కూడా రానివ్వొద్దని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఉత్తరాది మత శక్తుల చేతుల్లోకి నెట్టివేసే కుట్రలులను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. భావ సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు రాజ్ కుమార్ వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ గణేష్, వినోద్, విజయ్ కుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *