ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో లైన్ వస్తోంది! డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 16; కొత్తపేట డివిజన్ నందు గతంలో దాదాపు 4 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంజూరు చేయించడం జరిగింది.దానిలో భాగంగా పలు శంకుస్థాపన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.దానిలో భాగంగా పాత మారుతీ నగర్ కాలనీ మరియు కొత్తపేట్ గ్రామంలోని వివిధ ప్రదేశాలలో దెబ్బతిన్న రోడ్లను వేయడం,ఎస్.ఆర్.ఎల్.కాలనీ రోడ్డు నెం.4 నుండి రోడ్ నెం.12 వరకు సీ.సీ.రోడ్డు వేయడం,ప్రజయ్ నివాస్ h 1 నుండి 450mm డయా ఆర్.సీ.సీ.పైపులతో తుఫాను నీటి కాలువను వేయడం,న్యూ నాగోల్ కాలనీ వద్ద హెచ్.నెం.2-4-836/9 నుండి హెచ్.నెం.2-4-818/1/బి (ఓమ్నీ నాగోల్ మెయిన్ రోడ్‌లోని శ్వేతా నివాస్) రోడ్ నెం.1 వరకు సీ.సీ.రోడ్డు వేయడం,కొత్తపేటలోని రాఘవేంద్ర కాలనీ,ఆర్.బి.ఐ.కాలనీ మరియు ఇతర ప్రదేశాలలో సీ.సీ.రోడ్లు వేయడం,సమతాపురి కాలనీ వద్ద ఈషా కన్వెన్షన్ రోడ్డు వద్ద సీ.సీ.రోడ్డును వేయడం,కొత్తపేటలోని న్యూ నాగోల్ కాలనీలో సీ.సీ.రోడ్డు నెం.10,10ఏ లకు శంకుస్థాపన,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సీ.సీ.రోడ్డు వేయడం,కొత్తపేటలోని లోని న్యూ నాగోల్ కాలనీ వద్ద రోడ్డు నెం.6 నుండి రోడ్డు వరకు సీ.సీ.రోడ్డు,ఆర్.టీ.సీ కాలనీ కమ్యూనిటీ హాల్‌పై సీనియర్ సిటిజన్‌ల కోసం రెండవ అంతస్తు ప్రారంభోత్సవం,భారత్ నగర్ నందు యూ.జీ.డి.పనులకు సంబంధించిన శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు.ఇట్టి నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని తెలిపారు.ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి.వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.ఇట్టి కార్యక్రమంలో కొత్తపేట కార్పొరేటర్ పవన్,మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి,సీనియర్ నాయకులు లింగాల నాగేశ్వరరావు,ఆనంతుల రాజిరెడ్డి,,డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు లింగాల రాహుల్ గౌడ్, మహేష్ రెడ్డి ,మహిళా అధ్యక్షురాలు శ్వేత రెడ్డి,మాజీ అధ్యక్షులు ఉదయ్ గౌడ్,విశ్వేశ్వర్,శ్రీశైలం గౌడ్,విజయ,బొగ్గరపు వరుణ్, అనురాధ, మాలతి, ఇటికల యాదగిరి,దీప్ లాల్,యాదగిరి,నగేష్,పాండు గౌడ్,యాసిన్,జంగీర్ బాబు,ఆంజనేయులు,పులి వెంకట్, అనిల్, రాము, చిరు, సతీష్ శరన్ ,శశి, అమిత్ మరియు ఉద్యమకారులు,సీనియర్ నాయకులు,పలు విభాగాల కమిటీ సభ్యులు,మహిళలు,పార్టీ అభిమానులు,కార్యకర్తలు కాలనీ సంఘ సంక్షేమ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *