ఎల్‌ఐసి ప్రైవేటీకరణ తగదు

ఇందిరా పార్క్ ‌వద్ద ఏజెంట్ల ఆందోళన
ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ యత్నాలను వ్యతిరేకిస్తూ… ఏజెంట్లందరికీ మెడిక్లెయిమ్‌, ‌పెన్షన్‌ ‌సౌకర్యాలు కల్పించాలని ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ‌వద్ద ధర్నా చేశారు. ఇన్సూరెన్స్ ‌సెక్టార్లో అన్ని ట్రాన్సాక్షన్స్‌పై ఐఆర్‌డీఏఐ తొలగించాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్ ‌వయోపరిమితి పెంచాలని ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా సెంట్రల్‌ ‌డియా కోఆర్డినేటర్లు దామోదరన్‌, ‌రాజా డిమాండ్‌ ‌చేశారు.

ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ పేరుతో సాగుతున్న కార్యక్రమాలను నిలిపివేయాలని, సంస్థలో పాత కమిషన్‌ ‌విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్‌ ‌చేశారు. బీమా లావాదేవీలపై జీఎస్‌టీ రద్దు చేయాలని, బీమా సుగం పోర్టల్‌ను నిలిపి వేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఎల్‌ఐసీ ఏజెంట్లకు నష్టం చేకూర్చే బీమా సుగం విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఎల్‌ఐసీ అభివృద్ధి కావడానికి ప్రధాన కారణం ఏజెంట్లేనని దామోదరన్‌, ‌రాజా గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *