విరాళాలు ఇవ్వటం క్విడ్ ప్రోకోతో సమానమన్న సుప్రీమ్ కోర్టు
వివరాలు, దాతల పేర్లను వెల్లడిరచాలని ఎస్‌బిఐకి ఆదేశం
సుప్రీమ్ కోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం…మోదీ ప్రభుత్వానికి కమీషన్లకు మాధ్యమంగా మారిందని రాహుల్ విమర్శ
న్యూదిల్లీ, ఫిబ్రవరి 15 : రాజకీయ పార్టీలకు ఎలక్షన్ బాండ్ల పేరుతో విరాళాలు ఇవ్వటం క్విడ్ ప్రోకో కిందకే వొస్తుందని సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సదరు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రహస్యంగా ఉంచటం తగదని, 2019 నుంచి వొచ్చిన విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎలక్షన్ బాండ్ల మీద దేశవ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతుంది. కాగా ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బాండ్లను తీసుకొచ్చింది. 2017 ఆర్థిక బిల్లు ద్వారా ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టారు. 2018లో ఇవి అమల్లోకి వొచ్చాయి. నల్లధనం, అవినీతిని అరికట్టేందుకు.. రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు వీటిని తీసుకొచ్చామని అప్పట్లో చెప్పింది. బ్యాంక్ ద్వారా జారీ అయ్యే ఈ వడ్డీ రహిత ఎన్నికల బాండ్లను డోనర్(దాత) కొనుగోలు చేస్తారు. చెక్కు లేదా డిజిటల్ పేమెంట్ ద్వారా ఇది జరుగుతుంది. విరాళాలిచ్చేవారి రక్షణ కోసమే ఇది. ఈ గోప్యత పాటించకుంటే.. ప్రధానంగా డోనర్లు వాణిజ్యవేత్తలైన పక్షంలో రాజకీయ వివాదాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఆ బాండ్లను తనకు నచ్చిన పార్టీకి డోనర్ విరాళంగా అందజేస్తారు.
ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీలు ఆ బాండ్లను 15 రోజుల్లోగా నగదుగా మార్చుకుని తీరాలి. అయితే ఈ పథకంలో కొన్ని నిబంధనలను గమనిస్తే..పారదర్శకత నీటిమూటలాగే కనిపిస్తుంది. నగదు మూలాల గురించి డోనర్(వ్యక్తి/సంస్థ) వెల్లడిరచాల్సిన అవసరం లేదనేది ఓ నిబంధన. రాజకీయ పార్టీలు కూడా ఆ విరాళాలు ఎక్కడ నుంచి వొచ్చాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కొనుగోలు చేసిన బాండ్లను డోనర్లు ఏ రాజకీయ పార్టీకి అందజేశారన్నవిషయం వారు వెల్లడిస్తే తప్ప బయట ప్రపంచానికి తెలియదు. డొల్ల కంపెనీలకు ఊతమిచ్చేందుకు ఇది పరోక్షంగా దోహదపడుతుందనేది సుస్పష్టం. నల్లధన ప్రవాహానికి ఇదో రాచమార్గంగా మారిందనేది అసోసియేషన్ ఫర్ డెమొక్రా టిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వాదన. ఎన్నికల బాండ్లను వ్యతిరేకిస్తూ సుప్రీమ్ కోర్టులో ఏడీఆర్ 2017లో పిటిషన్ వేయగా ఈ రోజు తీర్పు వెలువరించింది. ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ మాత్రమే బాండ్లను జారీ చేస్తుంది కాబట్టి.. కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీలు ఈ సమాచారాన్ని తమకు అనువుగా వినియోగించుకునే ప్రమాదమూ ఉంది.
లెక్కలకు మించి ఆదాయం ఉన్న సంస్థలు/వ్యక్తులు బాండ్లను విరాళంగా అందజేసి.. అధికార పార్టీలను ప్రసన్నం చేసుకునే సౌలభ్యం ఈ పథకంలో ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. కారణమేంటని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి.. అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయాలని సూచించారు. అప్పుడు అసలు విరాళాలే రావని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానమిచ్చారు. ఈ పిటిషన్లపై కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీమ్ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సమాచారం తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదని ఈ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
సుప్రీమ్ కోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం…మోదీ ప్రభుత్వానికి కమీషన్లకు మాధ్యమంగా మారిందని రాహుల్ విమర్శ
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఈసీ తీరుపై విమర్శంచింది. ఈ విమర్శలకు రాహుల్ గాంధీ స్పందిస్తూ..ఎన్నికల బాండ్లను మోదీ సర్కారు కమీషన్లకు మాధ్యమంగా మార్చేసిందని అన్నారు. ఇది ఈ రోజు కోర్టులో రుజువైందన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్విటర్‌లో స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఎన్నికల బాండ్ల పథకం.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాకుండ, పార్టమెంట్ ఆమోదించిన రెండు చట్టాలను కూడా ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు.
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఈసీ తీరుపై విమర్శంచింది. ఈ విమర్శలకు రాహుల్ గాంధీ స్పందిస్తూ..ఎన్నికల బాండ్లను మోదీ సర్కారు కమీషన్లకు మాధ్యమంగా మార్చేసిందని అన్నారు. ఇది ఈ రోజు కోర్టులో రుజువైందన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్విటర్‌లో స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఎన్నికల బాండ్ల పథకం.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాకుండ, పార్టమెంట్ ఆమోదించిన రెండు చట్టాలను కూడా ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు.
నోట్ల కంటే ఓట్లకే ఎక్కువ శక్తి ఉంటుంది అనే వాస్తవాన్ని ఈ తీర్పు బలపర్చిందన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు.చందాలిచ్చే దాతలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తు.. మోదీ ప్రభుత్వం అన్నదాతలకు పదే పదే అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది నిజమైతే.. రాజకీయ పార్టీలతో సమావేశమయ్యే విషయంలో ఈసీ ఎందుకింత మొండితనంగా వ్యవహరిస్తుందని ఆయన ప్రశ్నించారు. వీవీప్యాట్ల సమస్యలపై రాజకీయ పార్టీలతో ఈసీ ఎందుకు సమావేశం కావడం లేదు అన్నారు. ఈ అంశాన్ని కూడా సుప్రీమ్ కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని విశ్వాసిస్తునట్లు తెలిపారు.




