ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ఎర్రగడ్డ మోతి నగర్ అఖిల భారత యాదవ సంఘం, మేడిపల్లి, బోడుప్పల్ యాదవ సంఘం ల ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, ఖైరతాబాద్ త్రినయ్ యాదవ్, ఆల్ ఇండియా యాదవ్ ఉమెన్స్ ఫ్రెంట్ చైర్ పర్సన్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పాల్గొని యాదవులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూనగరానికే తలమానికమైన సదర్ సంబరాలు దున్నపోతుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. సదర్ ఉత్సవాలు దీపావళి పండుగ తెల్లారి జరుపుకుంటారని, ఆ ఊపు.. రూపు.. షేపు.. నగరంలో దీపావళి పటాకుల మోత ఒకెత్తయితే- ఆ తర్వాత జరిగే సదర్ సందడిలో కనిపించే దున్న పోతులు మరొక ఎత్తు అని శ్రీదేవియాదవ్ తెలిపారు.ప్రతియేటా నగరంలోని యాదవులు సదర్ ఉత్సవాలను ఉల్లాసంగా నిర్వహిస్తుంటారనీ, ఈసారి కూడా యాదవులు ఖరీదైన దున్నపోతులను ప్రదర్శనకు పెట్టారన్నారు. యాదవులు వాటిని సుందరంగా అలంకరించి ఊరేగింస్తూ వీటి వెంట ఈలలు, డ్యాన్సులు, మ్యూజిక్కులతో సదర్ సంబరాలు వైభవంగా సాగాయి.కార్యక్రమంలో మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు,జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి అజారుద్దీన్, యాదవ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ మోతి నగర్,మేడిపల్లి, బోడుప్పల్ లో సదర్ సందడి




