షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 19: స్థానిక షాద్ నగర్ పట్టణ కేంద్రం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో గత నెల 27వ తేదిన షాద్ నగర్ లో జరిగిన కెసిఆర్ బహిరంగ సభకు వెళ్లిన చటాన్‌పల్లికి చెందిన మహిళా మంజుల యొక్క బంగారు వస్తువు (పుస్తెలతాడు) పొగొట్టుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని వారి కుటుంబానికి కాంగ్రెస్ యువ నాయకుడు అలోనిపల్లి రాజు గౌడ్ చటాన్ పల్లి, రాంనగర్ కాలనీ కాంగ్రెస్ నాయకులు షాద్ నగర్ శాసనసభ సభ్యులు వీర్లపల్లి శంకర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్బంగా ఆ మహిళకు (బంగారు పుస్తె) షాద్ నగర్ శాసనసభ సభ్యులు
వీర్లపల్లి శంకర్ మరియు నాలుగవ వార్డు మాజీ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి, మూడవవారు కౌన్సిలర్
రాయికల్ శ్రీనివాస్ మరియు పార్టీనాయకులు యువ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో బహుకరించడం జరిగింది..




