ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల నుండి శుభాకాంక్షల వెల్లువలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ఆమనగల్లు పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ గుర్రం కేశవులు ఆధ్వర్యంలో పలువురు మర్యాదపూర్వకంగా కలుసుకొని నారాయణరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొందాననీ వారి సేవకు తన శ్రాయశక్తుల కృషి చేస్తానన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని మిగతా నాలుగు గ్యారంటీల్ని వంద రోజుల్లో ప్రారంభిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి ఆ రుణాన్ని తీర్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలజీ సింగ్, కోట నవీన్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నారాయణరెడ్డి కి అభినందనల వెల్లువ





