స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరిన బిఆర్ఎస్
హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి18: కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామని తెలిపారు. యాక్షన్ తీసుకుంటామని స్పీకర్ చెప్పినట్లు పేర్కొన్నారు. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి..
ఇప్పుడు మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని రేవంత్‌పై కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు.దానం నాగేందర్ ను డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కలిసి పిటిషన్ ఇచ్చామన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటా అన్నారని తెలిపారు. దానంను బీడీలు అమ్ముకునే వారని రేవంత్ అన్నారని.. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఉందని.. రేవంత్ రెడ్డి రు కొట్టారు మేం తీసుకున్నాం.. ఇక మేము కొట్టినప్పుడు రు లేవలేరని తెలిపారు. మేము గేట్లు ఎత్తినప్పుడు రు భూ స్థాపితం అవుతారని రేవంత్‌ను పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.





