ఎమ్మెల్యే జిఎంఆర్ కు జై కొట్టిన భవసార క్షత్రియ రంగరాజ్ సమాజ్  

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: పటాన్ చెరు ప్రగతి సాధకుడు, బిఆర్ఎస్ పార్టీ  పటాన్ చెరు నియోజకవర్గ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కుల, మతాలకు అతీతంగా ఏకగ్రీవాల మద్దతుల పరంపర సాగుతుంది.తాజాగా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని భవసార్ క్షత్రియ సమాజం నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎమ్మెల్యే జిఎంఆర్ కు మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు.గురువారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో భవసార్ క్షత్రియ రంగరాజ్ సమాజం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఏకగ్రీవ మద్దతును ప్రకటించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ విజయానికి సంపూర్ణ మద్దతు అందిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు, జిమ్మిక్కులు చేసినా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. దశాబ్ది కాలంలో  9000 కోట్ల రూపాయలతో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్ర పథంలో నిలిపామని తెలిపారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాజ్ అధ్యక్షులు విశ్వనాథరావు, ప్రధాన కార్యదర్శి దీపక్ సూర్యన్, అశోక్ కుమార్, మాణిక్ రావు, రామకృష్ణ, అముల్ తెల్కర్, రాజేష్ పద్మాకర్ విజయలక్ష్మి, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *