పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 25: క్రైస్తవులు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని చర్చిలకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కేకులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పటాన్ చెరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి చర్చి పాస్టర్లకు కేకులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే జిఎంఆర్ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో చర్చిలకు కేకుల పంపిణీ





