ఎమ్మెల్యే ఆనంద్ కృషితో వికారాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది : పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 24: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ అభివృద్ధికి అన్ని రంగాల్లో కృషి చేస్తూ వికారాబాద్ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతూ వికారాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని వికారాబాద్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లు అనంతరెడ్డి గోపాల్ కిరణ్ పటేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి కృష్ణ కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్ లక్ష్మీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా వికారాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆనందు కృషి చేస్తూ అసెంబ్లీలో వికారాబాద్ ప్రాంత సమస్యలను లేవనెత్తి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చి భారీగా నిధులు తీసుకురావడం జరుగుతుందన్నారు. గతంలో వికారాబాద్ లో ఇంటర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో లేకపోయినప్పటికీ ఎమ్మెల్యే కృషితో ఇంటర్ డిగ్రీ కళాశాలలు మంజూర అయ్యి విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఏర్పడిందన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా కు మెడికల్ కళాశాల ఆయుష్ ఆసుపత్రి, ఎమర్జెన్సీ కేర్ ఆస్పత్రి మంజూరు కావడం జరిగిందన్నారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కేంద్రమైన వికారాబాద్ పట్టణానికి 60 కోట్ల నిధులు తీసుకురావడమే కాకుండా 96 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ వికారాబాద్ అండర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ ద్వారా ప్రొసీడింగ్ అందుకోవడం జరిగిందన్నారు. మూడు నాలుగు నెలలు వికారాబాద్ అన్ని రంగాల్లో మౌలిక వసతులతో అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలవబోతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ స్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *