తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: ఎమ్మెల్యేగా ఒక్కసారి ఆశీర్వదిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తాండూరు నియోజకవర్గం లోని నారాయణపూర్ గ్రామములో రామస్వామి, హనుమాన్,ఎల్లమ్మ ఆలయంలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.మీ సమస్యలపై అవగాహన ఉన్నవాడిని, మీ బిడ్డగా ఒక్కసారి నన్ను తాండూర్ ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా అని డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి గారు అన్నారు… నారాయణపూర్ గ్రామంలో బీఆర్ఎస్, బిజెపి కార్యకర్తలకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడారు… మన ప్రాంతాన్ని పాలిస్తున్న నాయకులకు ఇక్కడి ప్రజలు బై బై చెప్పాలని అన్నారు… కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఉపాధి, ఇండ్లు, కాలువల ద్వారా వ్యవసాయానికి ప్రాజెక్టుల ద్వారా నీరు లభించాయని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నపుడు, కాంగ్రెస్ హయాంలోనే తాండూర్ నియోజకవర్గంలో పేదలకు ఇండ్లు, సంక్షేమ పథకాలు అందాయని అన్నారు… ప్రస్తుతం బీ ఆర్ ఎస్ అవినీతి కుంభకోణంలో మునిగిపోయి ఉందని, కాంగ్రెస్ పార్టీ సంక్షేమం వైపు ఉందని అన్నారు.. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి పేద ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్,అశోక్, గ్రామ శాఖ అధ్యక్షులు కుమ్మరి అందిలప్ప, ఉపాధ్యక్షులు యాదప్ప, గోవింద్ రెడ్డి, నాయకులు మైశప్ప,పురుషోత్తం రెడ్డి,రాజు,నరేందర్ రెడ్డి,గొరేమియ,కర్రిం,మరియు కాంగ్రెస్ నాయకులు,మహిళ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి.. అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా



