ఎపిలో వైసిపి దుర్మార్గపు పాలన

  • అవినీతి రాజకీయాలను తుదముట్టిస్తాం
  • జగన్‌ అ‌క్రమపాలనపై ప్రజల తిరుగుబాటు
  • బిజెపి కార్యవర్గ సమావేశాల్లో సోము వీర్రాజు

భీమవరం,జనవరి24:అధికారం కోసం హత్యా రాజకీయాలను చేస్తున్న రాక్షస ప్రభుత్వం ఏపీలో ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. ఇంతటి దారుణ ప్రభుత్వాన్ని గతంలో చూడలేదన్నారు. జరుగుతున్న బీజేపీ (రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అవినీతి రాజకీయాలను నాశనం చేయాలనేదే బీజేపీ లక్ష్యమని, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. దోపిడీ , దుర్మార్గం , అవినీతి , అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టడం మినహా మరో కార్యక్రమం లేదన్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడటం తప్ప అభివృద్ధి అనే అంశాన్ని ఏమాత్రం పట్టించుకోని జగన్‌ ‌ప్రభుత్వంకు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.  అభివృద్ధికి కృషి చేయని కుటుంబాల పాలనలో రాష్ట్రం చిక్కుకుంది. కుటుంబ పార్టీల కబంధ హస్తాల నుండి రాష్టాన్న్రి భాజపా మాత్రమే కాపాడుతుందని సోము అన్నారు.

ఆనాడు జగన్‌ ‌పాదయాత్ర చేయ లేదా?.. ఇప్పుడు ఎమ్జ్గ•న్సీని తలపించేలా జీవో ఎందుకని ప్రశ్నించారు. జీవో నెం. 1కి వ్యతిరేకంగా ఛలో తిరుపతికి పిలుపు ఇస్తామని సోమువీర్రాజు పేర్కొన్నారు. జగన్‌ ‌ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వనరుల న్నింటిని అవినీతిమయం చేస్తోందని, కుటుంబ, అవినీతి రాజకీయాలను నాశనం చేయాలనేదే బీజేపీ లక్ష్యమని సోము వీర్రాజు అన్నారు. సంక్షేమం పేరుతో ప్రభుత్వం అప్పులు చేస్తోందని విమర్శించారు. జగన్‌ ‌నవరత్నాలు ఎక్కువా?.. మోదీ చేసే సంక్షేమం ఎక్కువా? అన్నది తేల్చడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో బటన్‌ ‌నొక్కి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. జగన్‌ ‌ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా బీజీపీకే ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. మతాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్నది అధికార ప్రభుత్వం మాత్రమేనని, పాస్టర్లకు జీతాలుగా ఇస్తున్న డబ్బులు హిందూ దేవాలయాలలో భక్తులు సమర్పించే కానుకలు అన్నారు. ప్రభుత్వ ఖజానాకు మార్చడం ద్వారా కాదా అన్నారు.  లేదంటే చర్చిల ద్వారా వచ్చే ఆదాయం ఉంటే ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ ‌చేస్తుందని  అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *