మూడవ విడతను ప్రారంభించిన సిఎం జగన్
విజయవాడ, జూన్ 26 : సోమవారం ఎపిలో జూనియర్ న్యాయవాదులకు చేయూతనందించే వైఎస్సార్ లా నేస్తం పథకం మూడవ విడత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నుండి కలెక్టర్ కార్యాలయల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఎస్.
ఢిల్లీరావు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్, మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీ శైలజ రెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి, వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌస్ మొహంతి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ జమల పూర్ణమ్మ, ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు విజిత పాల్గొన్నారు.




