ఎపిలో పలు జిల్లాలో తీవ్ర పంట నష్టం

గుంటూరు, డిసెంబర్‌ 12 : ఎపిలో మాండూస్‌ ‌తుఫాను రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ముఖ్యంగా పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. రైతుల వెన్ను విరిచింది. తుపాను తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు కూడా వర్షాలు కొనసాగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ముసురు వాతావరణం, చలి గాలులు మాత్రం కొనసాగాయి. తమ పొలాల్లోని పంట పరిస్థితిని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పంట నష్టాల అంచనాల్లో అధికార యంత్రాంగం ఉంది. బాపట్ల జిల్లా కృష్టా పశ్చిమ డెల్టా పరిధిలోని రేప్లలె, బాపట్ల వ్యవసాయ సబ్‌ ‌డివిజన్ల పరిధిలో వర్షాలకు ముందు కోసి అరబెట్టిన 30 వేల ఎకరాల్లోపైగా వరి కంకులు నీట మునిగాయి. మాగాణి భూముల్లో కోసిన పరి పంట నీటిపై తేలియాడుతుంది.

మరో 40 వేల ఎకరాల్లో వరి వరి పైరు వర్షం, గాలులకు ఒరిగిపోయింది. పత్తి, మినుము, మిర్చి, పసుపు, ఉద్యాన పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలో సాగర్‌ ఆయకట్టులో కోసిన వరి ఓదెలు నీటిలో తేలియాడుతున్నాయి. త్రిపురాంతకం, దర్శి, తాళ్లూరు మండలాల్లో వరికి బాగా నష్టం వాటిల్లింది. వరి ధాన్యం తడిచిపోవడంతో రంగు మారే ప్రమాదం ఉంది. పశ్చిమ ప్రాంతంలో మిర్చికి అధికంగా నష్టం వాటిల్లింది. దోర్నాల, పెద్దారవీడు ప్రాంతాల్లో మిర్చి తోటల్లో నీరు చేరింది. కాయలు రాలిపోయాయి. మినుము, బబ్బర్లు, పొగాకు పంటకూ నష్టం వాటిల్లింది. కడప జిల్లాలోని 35 మండలాల్లో, అన్నమయ్య జిల్లాలోని ఏడు మండలాల్లో మొత్తం 9,001 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

కడప జిల్లాలో పోరుమామిళ్ల, కలసపాడు, బి.కోడూరు, బి.మఠం, కాశినాయన, బద్వేల్‌, ‌గోపవరం, అట్లూరు, సిద్ధవటం, ప్రొద్దుటూరు, పెద్దముడియం, మైదుకూరు, చాపాడు, వి.ఎన్‌పల్లి, వల్లూరు మండలాల్లోని సుమారు 30 రకాల పంటలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. 4,387 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 2,062 ఎకరాల్లో బుడ్డశనగ, 1,042 ఎకరాల్లో వరి, 1,235 ఎకరాల్లో జన్న పంటలు నేలకొరిగాయి. 141.5 ఎకరాల్లో పండ్ల తోటలపై ప్రభావం చూపించింది. అరటి, ఉల్లి, టమోటో పంటలకు నష్టం వాటిల్లింది. అన్నమయ్య జిల్లాలో మదనపల్లి, పీలేరు, రాజంపేట, లక్కిరెడ్డిపల్లి, మదనపల్లి, నిమ్మనపల్లి, కొరబాలకుంట, బి.కొత్తకోట, పెనగలూరు, రామాపురం మండలాల్లో వరి దెబ్బతింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *