పోలవరంలో కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు
రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు
విజయవాడ, జూలై 13 : కేంద్ర సాయంతో పథకాలు నడుస్తున్నాయే తప్ప రాష్ట్రం ఏ ఒక్క అభివృద్ది పనికీ నిధులు వెచ్చించడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతుల చేపట్టిన దివంగత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి తనయ, కేంద్రమాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి విమ్శించారు. అనేక రంగాల్లో కేంద్రం నిధులు కేటాయిస్తున్నా..రాష్ట్రం మాత్రం తన వాటాను కలిపి అభివృద్దికి సహకారం అందించడం లేదన్నారు. గురువారం ఆమె పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ నగరంలోని బీజేపీ పార్టీ కార్యాయలంలో ఆమె బీజేపీ నూతన అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి డియాతో మాట్లాడుతూ.. తనను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు.
బీజేపీ.. అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీ అని.. అవినీతిని వ్యతిరేకించే పార్టీ అని అన్నారు. ఏపీలో బీజేపీ అన్ని విధాలా సహకారం అందించిందని చెప్పుకొచ్చారు. బీజేపీ అందించిన సహకారం ఎలాంటిదో చూడాలన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. కేంద్రం చలవతోనే రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయన్నారు.జగన్ సర్కార్‌పై పురంధేశ్వరి మండిపడ్డారు. జాతీయ రహదారులు 8623 కిలో టర్ల నిర్మాణాలకు రూ.1 లక్షా 15 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్ధితి ప్రజలందరికీ తెలుసన్నారు. ఏపీ డివిజన్ యాక్ట్ ప్రకారం రెండేళ్లలోనే జాతీయ విద్యా సంస్ధ లన్నీ కేంద్రం ఏపీలో నిర్మించిందన్నారు. ఎయిర్ పోర్టుల విస్తరణను కేంద్ర ప్రభుత్వ సహకారం తోనే ఏపీలో అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలోని నిమ్స్‌ను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.




