సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 25: ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే సి-విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ ఎన్నికలలో మద్యం, మందు మరియు ఇతర ప్రలోభాలు ఓటర్లను ప్రభావితం చేయకుండా ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతున్న కృషిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగితే ప్రజల ద్వారా నేరుగా ఫిర్యాదులను చేసేందుకు సి-విజిల్ యాప్ ను ఎన్నికల సంఘం రూపొందించిందని ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మద్యం, మాదక ద్రవ్యాల పంపిణీ, నగదు పంపిణీ, ప్రజల ఆస్తులను పాడు చేయడం, ప్రలోభ పెట్టే వస్తువుల పంపిణీ, ఓటర్లను బెదిరించడం తదితర ఎన్నికల నిబంధన ఉల్లంఘనలను రికార్డు చేసి సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో ఎన్నికల అధికారులు స్పందించి యాక్షన్ తీసుకుంటారని ఆ ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే సి-విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలి




