సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23: తెలంగాణ శాసనసభ సాధరణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో హుస్నాబాద్-32, సిద్దిపేట-33 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ జయ ఎస్. భోజ్ (ఐఎఎస్),దుబ్బాక-41, గజ్వేల్-42 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ మన్మోహన్ ప్రసాద్ (ఐఎఎస్) ,పోలిస్ అబ్జర్వర్ సోనం టెన్సింగ్ బూటీయా ( ఐపిఎస్)సమక్షంలో జిల్లాలోని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు నియమించిన మైక్రో అబ్జర్వర్లకు రెండవ స్థాయి శిక్షణ తరగతులను జిల్లా మాస్టర్ ట్రైనింగ్ ప్రదాన అధికారి అయోధ్య రెడ్డి ,బృందం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం మీకు కేటాయించిన క్రిటికల్ పోలీంగ్ స్టేషన్ లలో అన్ని సదుపాయాలు ఉన్నాయా చూడాలి. పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల దూరంలో ఎలాంటి పోలిటికల్ పార్టీ పోస్టర్, ప్లేక్సి లు ఎవి లేకుండా చేసుకోవాలి. అలాగే పోలింగ్ బూత్ లలో ఓటింగ్ కంపార్ట్మెంట్, ఫర్నీచర్, ఎలక్ట్రిసిటీ, రాంప్, సైన్ బోర్డులు, వాటర్ పెసిలిటి ఇలా ప్రతిది పరిశీలించాలి.క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ప్రిసైడింగ్ అధికారుల, అసిస్టెంట్, అధర్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు మీరు కూడా భాగస్వాములు, కాని మీరు పరిశీలకులు మాత్రమే ప్రతిదీ పరిశీలిస్తూ ఉండాలి. కానీ అథారిటీ మొత్తం ప్రిసైడింగ్ అధికారులకే ఉంటుంది.ఈవీఎం మిషన్ల లో బ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ అనుసంధానం, ఆపరేట్ చేసే విధానం, పోలింగ్ డే రోజు మాక్ పోలింగ్ ప్రక్రియ గూర్చి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ప్రతి విషయం గూర్చి అవగాహన కలిగి ఉండాలి.మైక్రో అబ్జర్వర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత 29 రోజు కేటాయించిన నియోజకవర్గలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి వెళ్ళాలి. అక్కడ రిటర్నింగ్ అధికారి ఐడి కార్డు అందజేస్తారు. డ్యూటీ విషయంలో పై అధికారులను సంప్రదించాలి.క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతి మూమెంట్ ను కలెక్టరేట్ కార్యాలయంలో వీక్షించడం, స్టోరేజ్ చేయడం జరుగుతుందనే విషయాన్ని ప్రతి ఓక్క మైక్రో అబ్జర్వర్ గుర్తు పెట్టుకోవాలి. శిక్షణ తరగతుల్లో ప్రతి ఒక్క మైక్రో అబ్జర్వర్ పాల్గొని మాస్టర్ ట్రైనర్ తెలిపిన విధంగా ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకొని 100% శిక్షణను సద్వినియోగం చేసుకొని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో ఎర్రర్ ఫ్రీ ఎలక్షన్ కండక్ట్ చేసే విధంగా నేర్చుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో లిడ్ బ్యాంక్ మేనేజర్, మైక్రో అబ్జర్వర్ నోడల్ ఆఫీసర్ సత్యజిత్, ఎలక్షన్ సూపరిండెంట్ .రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.





