ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 21:  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు.  మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ శిక్షణ కేంద్రాలను సందర్శించిన సందర్భంగా పిఓలు, ఏపిఓ పోలింగ్ ప్రక్రియపై పలు సూచనలు,  సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో   సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించి విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.  ఎన్నికల కమిషన్ ఇచ్చిన హ్యాండ్ బుక్ లెట్స్ ను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధానాన్ని ఎలాంటి తప్పులు జరగకుండా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధి నిర్వహణలో పనిచేసే అధికారులు ఎలాంటి ఒత్తిడికి  లోను కాకుండా ప్రశాంతంగా అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ పోలింగ్  ప్రక్రియను చేపట్టాలన్నారు. అధికారులు  బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలింగ్  సజావుగా జరిగేలా సహకరించాలని కలెక్టర్ కోరారు. రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా కంగారు పడకుండా జాగ్రత్తగా విధులను చేపట్టాలని ఆయన సూచించారు. మాక్ పోలింగ్ ను నిర్వహించిన తదనంతరం అన్ని క్లియర్ చేసి పోలింగ్ ను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ముందుగా జెడ్పిహెచ్ఎస్ లో జరుగుతున్న బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ తో పాటు పరిగి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, విజయ కుమారి, మ్యాన్ పవర్ నోడల్ అధికారి దీపా రెడ్డి, డిహెచ్ఎస్ఓ చక్రపాణి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆనంద్ రావు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *