ఎన్నికల నిర్వహణ పరిశీలన అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 31:  అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్నారు ఎన్నికల పరిశీలకులు బస చేసేందుకు వీలుగా అనంతగిరి గుట్ట పై ఉన్న హరిత రిసార్ట్ ను ఎంపిక చేయడం జరిగిందాని అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ కోటిరెడ్డిలు రిసార్ట్ లో ఏర్పాట్లు చేస్తున్న వసతుల కల్పనపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెరుగైన  మొబైల్ సిగ్నల్స్, వైఫై సౌకర్యం ఉండేలా  అధికారులు ఇక్కడ  అన్ని ప్రత్యేక చర్యలు చేపట్టారు. కలెక్టర్ సందర్శనలో అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఆర్ అండ్ బి  డిఇఇ శ్రీధర్ రెడ్డి, డిఎల్పిఓ శంకర్ నాయక్, డిఆర్డిఓ అధికారులు స్టీవెన్ నీల్, నర్సింలు తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *