తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: ప్రజలు ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలని తాండూరు డిఎస్పి శేఖర్ గౌడ్ అన్నారు రాబోవు శాసనసభ ఎన్నికల సందర్భంగా సోమవారం యాలాల పోలీస్ స్టేషన్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన డిఎస్పి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల నియమాలు కచ్చితంగా పాటించాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా అన్ని విషయాలను పరిశీలిస్తుందని తెలిపారు. కావున ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికలు నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ రూరల్ సీఐ రాంబాబు తాసిల్దార్ మనురుద్దీన్ ఎంపీడీవో పుష్పలీల ఎస్సై అరవింద్ కుమార్ మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలి




