ఎన్నికల నిబంధనలు పాటించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ప్రతి దుకాణాదారుడు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యా నాద్ చౌహాన్  అన్నారు. సోమవారం ఆమనగల్ పట్టణంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న సాలెమ్మ దుకాణం పై దాడులు నిర్వహించి 55 లిక్కర్ బాటిల్లను  16 బీర్లను స్వాధీనం పరుచుకున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఇండ్లలో, ఫంక్షన్ హాల్ లో మద్యం నిల్వ ఉంచినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సైలు యాదయ్య, స్వప్న, హెడ్ కానిస్టేబుళ్లు శంకర్, రాజేంద్రప్రసాద్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *