ఎన్నికల నిబంధనలు ఉల్లాంఘిస్తే

సంగారెడ్డి,ప్రజాతంత్ర, అక్టోబర్ 25: ఎవరైనా సరే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సోషల్ మీడియా లేక వేరే మార్గంలో రెచ్చగొట్టే విధంగా మెసేజ్ చేసినా మాట్లాడినా  అటువంటి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ రూపేష్  హెచ్చరించారు. బుధవారం  స్థానిక గోకుల్ ఫంక్షన్ హాల్ లో సంగారెడ్డి జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. డి.జి.పి అంజనీ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ సి.హెచ్ రూపేష్ రౌడీషీటర్స్ కు కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా  ఎస్పీ సి.హెచ్ రూపేష్ మాట్లాడుతూ  జరగబోయే ఎన్నికల్లో  ఎటువంటి నేరం చేయకూడదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *