ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలి

శరత్సంగారెడ్డి, ప్రజాతంత్ర,అక్టోబర్ 12: అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచు కోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి కలెక్టర్ శరత్    ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో కి వచ్చిందని, ఎన్నికల కమిషన్ నిబంధనలను విధిగా పాటించాలన్నారు. ఇంజనీరింగ్ శాఖలు  చేపట్టిన వివిధ పనులలో గ్రౌండింగ్ అయి పనులు జరుగుతున్నట్లైతే, అట్టి పనులను చేయ వచ్చని, కొత్త పనులను, కొత్తగా గ్రౌండింగ్ చేయకూడదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించరాదని స్పష్టం చేశారు. ఆయా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్  వారీగా వివిధ పథకాలలో చేపట్టిన పనులు,పూర్టైనవి, ప్రారంభమై పురోగతిలో వున్నవి, ఇంకా గ్రౌండింగ్ కాని పనుల వివరాలను     వెంటనే అందించాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ర్యాంప్ ఉండాలని, తాగునీటి సరఫరా సమస్యలు ఉన్నట్లయితే రెండు రోజుల లోగా ఆయా రిపేర్లు పూర్తి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ,ఇంజనీరింగ్ శాఖల ఎస్.ఈ.లు, ఈ ఈ లు,డి ఈ లు, ఏ ఈ లు, డిఆర్ఓ నగేష్ ఆర్డీవో రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *