ఎన్నికల్లో డబ్బులు, మందు పంపిణీ కట్టడి చేయండి

  • కేంద్ర ఎన్నికల బృందాన్ని కోరిన సీపీఎం నేతలు
  • తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌కేంద్ర ఎన్నికల బృందాన్ని సీపీఎం నేతలు కలిశారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల తీరుపై వారికి వివరించారు. గత ఎన్నికల్లో బూత్‌ ఎన్నుకోడానికి ఇబ్బంది అయ్యిందని సీపీఎం నేతలు వారికి తెలిపారు. అంతేకాకుండా.. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. వోటర్లకి డబ్బు అందిన తరువాతే వోటు వేశారని అన్నారు. ఆన్లైన్‌ ‌లో వోటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం లేదని.. మూడు రోజుల ముందు వరకు అవకాశం కల్పించాలని కోరారు. పోలింగ్‌ ‌సెంటర్‌లో 1000 మంది ఉండకుండా చూడాలని చెప్పామన్నారు. అంతేకాకుండా.. ఎన్నికల్లో డబ్బులు, మందు పంపిణీ కట్టడి చేయాలని కోరినట్లు సీపీఐ నేతలు తెలిపారు. గత ఎన్నికల్లో వందల కోట్ల దొరికాయని.. వాటిపై ఎలాంటి శిక్ష వేశారో చెప్పాలన్నారు. హైదరాబాద్‌ 59 ‌శాతం పోలింగ్‌ అవ్వడానికి కారణం.. బూత్‌ ‌దొరకకనేనని సీపీఐ నేతలు పేర్కొన్నారు. కాగా తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తుంది.

సీఈసీ రాజీవ్‌ ‌కుమార్‌ ‌నేతృత్వంలోని బృందం   మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సీఈసీ బృందం సమీక్షించనుంది. అందులో భాగంగానే   పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో భేటీ కానున్నారు.  మొత్తం 17 మంది అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సీఈసీ నేతృత్వంలోని బృందం సమీక్షించనుంది.   రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది. మరోవైపు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా సీఈసీ బృందం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఓటర్ల జాబితా, ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది.

ఈసీ ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధులను ఆహ్వానించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. అంతేకాదు రాజకీయ పార్టీల ఫిర్యాదులపై సమీక్ష నిర్వహిస్తారు. రేపు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది. ఎల్లుండి వికలాంగ ఓటర్లు ఓటు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సీఈసీ సమీక్ష నిర్వహించనుంది. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ బృందం మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. డిసెంబర్‌ 13, 2018‌న %దీ=•% ప్రభుత్వం రద్దు చేయబడుతుంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్‌ 12‌లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. డిసెంబర్‌ 12 ‌నాటికి ఎన్నికల పక్రియను పూర్తి చేసేందుకు ఈసీ కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉంది.మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన ఈసీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *