ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించండి

పరిగి,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: అసెంబ్లీ ఎన్నికలను సజావుగా జరిగేలా సహకరించాలని పరిగి డిఎస్పీ కరుణా సాగర్ రెడ్డి కోరారు.గురువారం పరిగి నియోజక వర్గంలోని పరిగి,దోమ మండల పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలని అన్నారు. పార్టీల తరపున జరిపే సభలు సమావేశాలకు సువిధ యాప్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో దూషణలు నిషిద్ధమని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సలహాలు సూచనల కొరకు పోలీస్ స్టేషన్లో ఎలక్షన్ సెల్ అందుబాటులో ఉంటుందని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటరామయ్య, ఎస్సైలు సత్యనారాయణ, రవి గౌడ్, పోలీస్ సిబ్బంది పలువురు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *