ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 29 : అమనగల్లు, కడ్తాల్ సర్కిల్ పరిధిలోని కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు పోలీస్ స్టేషన్ లలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమనగల్లు, కడ్తాల్ సీఐ వెంకటేశ్వర్లు, శివప్రసాద్ లో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడ్తాల్, ఆమనగల్ మండలాల్లో 17 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించడం జరిగిందన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఐదు మంది అభ్యర్థులు గుముగూడిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రౌడీషీటర్లను బైండోవర్ చేసినట్లు ఆయన వివరించారు. వీరు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ సిబ్బంది సాయుధ బలగాలతో కలిపి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసిన ఇష్టానుసారంగా మద్యం డబ్బులు పంపిణీ చేసినట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలని సిఐలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *