ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, వి.వి ప్యాట్స్‌ వినియోగం తీరుపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా కలెక్టర్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: శాసనసభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, వి.వి ప్యాట్స్‌ వినియోగం తీరుపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలో ని సమావేశ మందిరంలో   డిస్టిక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ బృంద ప్రధాన అధికారి ఆయోద్య రెడ్డి, ఇతర అధికారులు
 ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ రోజు ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రిసెండింగ్ ఆపిసర్స్, సెక్టర్ అధికారులకు వివి ప్యాట్ మిషన్, బాలెట్ యునిట్, కంట్రోల్ యూనిట్లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్‌ ప్రారంభించుటకు ముందు మాక్‌ పోలింగ్‌ నిర్వహించు విధానం, ఈ.వి.ఎమ్‌లు, వి.వి.ప్యాట్స్‌ కనెక్షన్లు, బ్యాలెట్‌ యూనిట్లు సెట్టింగ్‌ను తనిఖీ చేసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం శిక్షకులు వీటికి సంబంధించిన మ్యాన్యువల్స్‌పై సంపూర్ణ అవగాహన కలిగి సిద్దంగా ఉండాలని అన్నారు. ఇట్టి విషయాన్ని సీరియస్‌గా పరిగణించి విధులు నిర్వర్తించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియ, మాక్‌ పోలింగ్‌ ప్రక్రియను గూర్చి అందించిన బుక్ లెట్ లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి విధినిర్వహణలో ఎలాంటి అవరోధాలు లేకుండా పనిచెయ్యాలని అదికారులను ఆదేశీంచారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, హుస్నాబాద్ ఆర్వోలు గరిమా అగ్రవాల్, బన్సీలాల్, రమేష్ బాబు, బెన్ షాలం, తూప్రాన్ ఆర్డిఓ జయచంద్రరెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *