ఎన్‌డిఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

ప్రకటించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా

న్యూ దిల్లీ, జూన్‌ 21 : ‌సుదీర్ఘ తర్జన భర్జన అనంతరం ఎన్‌డిఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును మంగళవార బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. అంతకుముందు జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఒడిషా రాష్ట్రం మయూర్‌బంజ్‌ ‌జిల్లాలో జన్మించిన ద్రౌపది ముర్ము జార్ఖండ్‌ ‌రాష్ట్రం పూర్తి కాలం గవర్నర్‌గా, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేశారు. వివాద రహితురాలిగా ఆమెకు పేరుంది. తూర్పు ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ రాష్ట్రపతి అభ్యర్థి అయితే బాగుంటుందని భావించామని నడ్డా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *