ఎడ్‌సెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌టీఎస్‌ ఎడ్‌సెట్‌ -2022 ‌నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రెండేండ్ల బీఎడ్‌ ‌కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌లింబాద్రి, ఎడ్‌సెట్‌ ‌కన్వీనర్‌ ‌రామకృష్ణ, ఎడ్‌సెట్‌ ‌కో కన్వీనర్‌ ‌శంకర్‌ ‌విడుదల చేశారు. ఏప్రిల్‌ 7 ‌నుంచి జూన్‌ 15‌వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఆలస్య రుసుంతో జులై 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జులై 26, 27 తేదీల్లో ఎడ్‌సెట్‌ ‌పరీక్ష నిర్వహించ నున్నారు. రాష్ట్రంలోని 220 బీఎడ్‌ ‌కళాశాలల్లో 19,600 సీట్లు కలవు. గతేడాది నిర్వహించిన ఎడ్‌సెట్‌లో 33,683 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *