ఎట్లుంది ఇక్కడ… తెలంగాణను గుర్తు పెట్టుకుంటారా

బాగుంది..సమస్యలేమీ లేవు సర్‌..‌తెలంగాణను గుర్తుపెట్టుకుంటాం
రైల్వే ర్యాక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం సందర్భంగా బీహారీ కార్మికులతో మంత్రి హరీష్‌రావు సంభాషణ

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో రైల్వే రేక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం అనంతరం బీహారీ కార్మికులతో మంత్రి హరీష్‌రావు ఆసక్తికర సంభాషణ జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు. బీహారీ నుంచి వచ్చాం సర్‌. ‌నెలకు ఎంత వరకు సంపాదిస్తున్నారు. 30-40 వేల రూపాయల వరకు వస్తున్నాయి. 10 వేలు ఖర్చు పెట్టుకొని 20-30 వేల రూపాయలు ఇంటికి పంపిస్తాం. బీహారీ నుండి ఇక్కడిదాకా ఎందుకు వొచ్చారు. అక్కడ పని దొరకడం లేదు. అందుకే పొట్ట చేత పట్టుకొని వచ్చాం.

ఇక్కడ చేతినిండా పని ఉంది. ఇక్కడ ఏదైనా సమస్య ఉందా… మంచిగా చూసుకుంటున్నారా…చాలా బాగుంది. ఎలాంటి సమస్య లేదు. తెలంగాణను గుర్తు పెట్టుకుంటారా? అని మంత్రి హరీష్‌రావు కార్మికులతో అన్న సందర్భంగా తెలంగాణను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం అని మంత్రి హరీష్‌రావుతో కార్మికులు చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *