తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం
బుధవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త పీసీసీ ప్రతినిధుల సమావేశంలో 2 తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్రానికి చెందిన పిసిసి అధ్యక్షుడు, ఆఫీస్ బేరర్లు, ఎఐసిసి సభ్యులను నామినేట్ చేయడానికి ఎఐసిసి అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలని తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించగా, ఎఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీని అభ్యర్థిస్తూ మరొక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించారు.



