ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 01: మెదక్.ఎంపీ,దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి ఘటనను విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని,హింసతో ఎం సాధించలేరని అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్షాలు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దాడుల సంస్కృతి మంచిది కాదని నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోని ప్రజా జీవితంలోకి తిరిగి క్షేమంగా రావాలనిమంత్రి
ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో.జెడ్పీచైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, ఎం పి పి సునీత అంధ్య నాయక్ , బి ఆర్ ఎస్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య, సుధాకర్ రెడ్డి,మల్లేష్ యాదవ్, ఎం నవీన్, రాజునాయక్, గోపాల్ నాయక్, ప్రభాకర్, వీర్య నాయక్, ఆదిల్ తధితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *