ఎంఐఎం ‌కార్పొరేటర్‌ ‌కార్యాలయంలో హత్య

యువకుడిని హత్యచేసి పరారైన దుండగులు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌నగరంలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని లలిత్‌బాగ్‌ ‌కార్పొరేటర్‌ ‌కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భవానీనగర్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలోని లలితాభాగ్‌కు చెందిన ఏఎంఐఎం కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ ‌కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, అతని మేనల్లుడు సయ్యద్‌ ‌ముక్తాజాపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన ముక్తాజాను అక్కడనే ఉన్న పలువురు ప్రైవేటు ఆస్పతికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు.

కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ ‌సోదరి కొడుకే ముక్తాజా. మృతుడు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాడు. అయితే, స్నేహితుల మధ్య గొడవే ఈ హత్యకు కారణమని తెలుస్తున్నది. కార్పొరేటర్‌ ‌కార్యాలయంలో ఉండగానే ఏకకాలంలో దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తులు కలిసి ముర్తుజాపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వెంటనే సయ్యద్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *