‘‘ఉరి’’శాశ్వత పరిష్కారమా !?

మానవ మృగానికి

ఉరి శిక్ష పడిందని

న్యాయమే గెలిచిందని

సర్వత్రా కేరింతల జల్లు

 

పత్రికల్లో పతాక టైటిళ్లు

టివిల్లో ఠీవీగా ముచ్చట్లు

 

వ్యాట్సప్‌ ‌ఫెస్‌ ‌బుక్కుల్లో

విషెస్‌ ‌పోస్టుల పరవళ్లు

 

ఇంకొద్ది గడియల్లోనే

సద్దుమనుగు సందళ్ళు

అటుపై శరా మాములు

 

రేపు మరో ‘‘రేప్‌’’ అదేవిధం

సజీవ దహనం యధాతధం

జన స్పందనలు పాత రిథం

ఇవేకదా నిత్య సాక్షాత్కారం

 

కాల్చివేతలు , ఉరితీతలు

జీవితకారాగార శిక్షలతోనే

వికృత పోకడ అంతం కాదు

స్త్రీజాతికి విముక్తి దరి చేరదు

 

చీడల శాశ్వత విరుగుడుకు

తగిన మందును కనిపెట్టాలి

 

డ్రగ్స్, ‌పబ్స్, ‌మద్యం డ్రింక్స్

‌విష సంస్కృతిని ప్రారద్రోలాలి

 

యువతను పెడతోవ పట్టించే

మాధ్యమాలను నిషేదించాలి

 

బాల్యం నుంచే సామాజిక

నైతిక విలువలు పెంపొందే

విద్యా బోధనలు చేపట్టాలి

 

మొత్తంగా మనమంతా ఏకమై

సమాజ మార్పుకు సంకల్పిస్తేనే

ఈ వ్య(య)ధార్థ గాధలు సమాప్తం

స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రం సంప్రాప్తం

 (రమ్య కేసులో దోషికి ఉరిశిక్ష తీర్పుపై ప్రతిస్పందిస్తూ )

– కోడిగూటి తిరుపతి

:9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *