ఉప్పల్   ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని  కలిసిన  బి  ఆర్ ఎస్ ముఖ్య నాయకులు 

 ఉప్పల్, ప్రజాతంత్ర  , ఆగస్ట్ 23:  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉప్పల్ నియోజకవర్గ  బి  ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా బండారి లక్ష్మారెడ్డి ని ప్రకటించడం అభినందనీయం అని, వివాదాలు అన్ని పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పని చేసి మరోసారి ఉప్పల్ గడ్డమీద గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తాం అని   ఉప్పల్ నియోజకవర్గ   అన్ని డివిజన్ల  బి ఆర్  ఎస్ ముఖ్య నాయకులు స్పష్టం చేశారు.బుధవారం సైనిక్ పురి లోని పార్టీ కార్యాలయం లో బి ఆర్  ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు .    ఉప్పల్ నియోజకవర్గ బి ఆర్  ఎస్ పార్టీ అభ్యర్థి గా ఎంపిక ఐనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, ఎ  ఎస్ రావు నగర్ డివిజన్ ప్రెసిడెంట్ కాసం మహిపాల్ రెడ్డి,కాప్రా డివిజన్ ప్రెసిడెంట్ సుడుగు మహేందర్ రెడ్డి, నాచారం  బి ఆర్  ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ ముత్యం రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ అన్ని డివిజన్ల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్  ఉప్పల్ నియోజకవర్గ  బి ఎల్ ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి గా బండారి లక్ష్మారెడ్డి ని ప్రకటించడం అభినందనీయం అని వివాదాలు అన్ని పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పని చేసి మరోసారి ఉప్పల్ గడ్డమీద గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఏ ఎస్ రావు నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమార స్వామి, సీనియర్ నాయకులు బేతాళ బాలరాజు, ఏనుగు సీతారం రెడ్డి, మురళి పంతులు, శోభ రాణి,తెలంగాణ పద్మ, నాగపూరి రాజు, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *